విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి…..
రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరక్టర్ రాజీవ్……
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మన ఊరు మనబడి” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ శనివారం జిల్లా పరిషత్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మన ఊరి మనబడి కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయ సెక్టోరిల్ అధికారులు సబ్దర్అలీ ఖాన్, చౌదరి పరీక్షల కార్యదర్శి కే.భీమ్ రావు లతో కలిసి పర్యవేక్షించారు.
అనంతరం పాఠశాల ప్రార్థన సమయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులు,ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి ఉత్తములుగా ఎదగాలని, తమ కలలను సాకారం చేసుకోవాడానికి పాఠశాల విద్యను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి అభ్యసన నైపుణ్యాలను కలిగి ఉండాలని ఆ దిశగా అధికారులు, ఉపాధ్యాయులు సంసిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులు వంద శాతం పాఠశాలకు హాజరై పాఠశాలలోని నిర్వహించే అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని అన్నారు. భవిష్యత్తులో ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు కూడా ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు.
పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి బడిలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు తెలుసు కొని సంతృప్తి చెందారు.
ఈ సమావేశానికి ఉపాధ్యాయులు గుండేటి యోగేశ్వర్ సమన్వయం చేశారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గోలి మనోహర్, నాగరాజు, సునితాదేవీ తో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు..




