అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేసిన

అందోల్ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్

టేక్మాల్ జనం సాక్షి అక్టోబర్ 6 టేక్మాల్ మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. కాదులూరు తండా లొ ఎస్టీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, సర్మాన్ కుంట లో నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన, బర్రెంకల కుంటలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన
సంగ్య తాండ పంచాయతీ పరిధిలోని కడీలబాయి తండాలో ఎస్టీ కమిటీ హాల్ శంకుస్థాపన చేశారు. అనంతరం టేక్మాల్ మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ మరియు వర్షానికి పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ మల్లయ్య,సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.