క్రీడా ప్రాంగాణాలకు కిట్లు పంపిణి

జనంసాక్షి , కమాన్ పూర్, అక్టోబర్ 06 : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం గ్రామ పంచాయతీ క్రీడా ప్రాంగాణాలకు సంబందించిన క్రీడా సామాగ్రీని ఎంపిపి రాచకొండ లక్ష్మి పంపిణి చేశారు. మండలంలోని గుండారం, రొంపికుంట, నాగారం, పేరపల్లి, పెంచికల్ పేట్ గ్రామ పంచాయతీలకు అందజేయగా, అంతకు ముందు ప్రజా ఆశీర్వాద పాదయాత్ర లో జడ్పి చైర్మన్ పుట్ట మధు చేతుల మీదుగా అందజేసిన సంగతి తెల్సిందే. ఈ కార్యక్రమంలో ఎంపివో శేషయ్య సూరి, కమాన్ పూర్ – 2 ఎంపిటిసి బోనాల వెంకటస్వామి, సర్పంచ్ లు ఆకుల ఓదెలు, కటకం రవీందర్, కొండ వెంకటేష్, ఇటవేన కొమురమ్మ, తొగరి అన్నపూర్ణ, సీనియర్ అసిస్టెంట్ వంశీ, కార్యదర్శులు ప్రశాంత్, ఆనంద చారి, రాజ్యలక్ష్మి, రేణుక లు పాల్గొన్నారు.