Thursday, 5 November 2026

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు దేవరకొండ

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు దేవరకొండ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్
కొండమల్లేపల్లి డిసెంబర్ 5 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండలంలో ఆంగోదు తండా గ్రామపంచాయతీలో సోమవారం నాడు దేవరకొండ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ నాయక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి హైమాస్ట్ లైట్లు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలి అని దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.సోమవారం కొండమల్లేపల్లి మండలం ఆంగోతు తండాలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రూ.5లక్షలతో చేపడుతున్న పహరి గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఆలయ కమిటీ సభ్యులు రవీంద్ర కుమార్ ను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఆలయాలకు మహర్దశ వచ్చింది అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి కోసం, పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తోందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆలయాలకు పునర్వైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు సీఎం కేసీఆర్ కృషితో ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రమావత్ దసృ నాయక్,ప్రధాన కార్యదర్శి పసునూరి యుగేందర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,స్థానిక సర్పంచ్ ఆంబోతు పవన్,టిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు రమావత్ తూలిసిరామ్,మాజీ సర్పంచ్ రమావత్ శ్రీనివాస్ నాయక్ ,బొడ్డుపల్లి కృష్ణ,రమావత్ రాములు నాయక్ ,రమావత్ లాలు నాయక్, రాములు నాయక్ రవి స్వామి,శంకర్ నాయక్,లస్కార్, పంతు స్వామి, రామస్వామి, రవి స్వామి, చిన్నా స్వామి తదితరులు పాల్గొన్నారు