ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
-అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 7(జనంసాక్షి):
భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి తాహసిల్దార్లు రెవిన్యూ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ అన్నారు.కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై అదనపు కలెక్టర్ అధికారులతో మాట్లాడారు.వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆయన స్వీకరించారు.వివిధ సమస్యలపై 46 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
భూ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మండలాల రెవిన్యూ అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఏ నరసింగరావు, సిపిఓ భూపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.




