హైదరాబాదులో కుశ్నపల్లి దసిలి పట్టు వస్త్రాల ప్రదర్శన.
నెన్నెల, నవంబర్ 21, (జనంసాక్షి )
మండలంలోని కుశ్నపల్లి చేనేత కార్మికులు నేసిన దసిలి పట్టు వస్త్రాలను హైదరాబాదులో సరస్ -2022 మేళాలో ప్రదర్శనకు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేతి వృత్తుల ప్రదర్శన మేళాలో గణేష్ స్వయం సహాయక సంఘం వారు నేసిన టస్సర్ వస్త్రాల స్టాల్ ను నేతకార్మికుడు లిక్కి శంకరయ్య దంపతులు ఏర్పాటు చేశారు. నాన్యత.. ప్రమాణాలకు పేరెన్నికగన్న కుశ్నపల్లి దసలి వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని.. దేశంలోని నలు మూల ల నుంచి మేళాకు వచ్చిన వారు కొనుగోళ్లు చేస్తున్నారని శంకరయ్య తెలిపారు. ఈ నెల 28 వరకు సరస్ మేళా కొనసాగుతుందని చెప్పారు




