Wednesday, 4 November 2026

సత్రం నిర్మాణానికి అందరూ సహకరించండి.

 

 

 

 

 

– వరంగల్ ఈస్ట్, మే 06 (జనం సాక్షి)కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో మున్నూరు కాపు నిత్య అన్నదాన భవనం నిర్మాణం కోసం మున్నూరు కాపులంతా ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించాలని ట్రస్ట్ చైర్మన్ ఉప్పు రవీందర్ పటేల్ కోరారు. ఈ మేరకు శనివారం హనుమకొండ వికాస్ నగర్ లోని మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఉప్పు రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్రం భవన నిర్మాణానికి తాను వెయ్యి గజాల స్థలాన్ని విరాళంగా ఇచ్చినట్టు చెప్పారు. భక్తులకు సౌకర్యార్థంగా ఉండే విధంగా సత్ర నిర్మాణం జరిపేందుకు ఈ నెల 31న భూమి పూజ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్నూరు కాపులంతా కొమురవెల్లి కి తరలి రావాలని కోరారు ఈ సందర్భంగా వికాస్ నగర్ మున్నూరు కాపు సంఘం కోశాధికారి అల్లం మల్లికార్జున రావు పటేల్ సత్ర నిర్మాణం కోసం తన వంతుగా ఒక లక్ష 6 వేల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అదేవిధంగా సంఘానికి చెందిన పలువురు కూడా తమ వంతు సహాయము చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కొత్త దశరథం పటేల్, ప్రధాన కార్యదర్శి భాశెట్టి మల్లయ్య పటేల్, కోశాధికారి అల్లం మల్లికార్జున్ రావు పటేల్, పెరుమాండ్ల హరికిషన్ పటేల్, గోలి రామచందర్ పటేల్, కల్వల దుర్గయ్య పటేల్, మాడిశెట్టి శేఖర్, ఆలూరి రమేష్, బత్తుల రాజన్న  మంగు నవీన్,  చాగర్ల ఐలయ్య, కొండ నాగరాజు  లక్కాకుల సుదర్శనం తదితరులు పాల్గొన్నారు.