Friday, 6 November 2026

అభివృద్ధి పనులు కనబడతలేవా షబ్బీర్ అలీ ?

CM KCR fire on Shabbir Ali

కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీపై సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. ఇటీవల ప్రభుత్వ హామీలను ఫ్లెక్సీపై ముద్రించి వంద హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని మీడియా ముందుకొచ్చిన షబ్బీర్ అలీకి సీఎం కేసీఆర్ చురకలు అంటించారు. ఎల్లారెడ్డిలోని సదాశివనగర్ గ్రామంలో మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రారంభం చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈసందర్భంగా పక్కనే ఉన్న కామారెడ్డి నియోజవర్గం ప్రస్తావన వచ్చినపుడు సీఎం షబ్బీర్ అలీ గురించి మాట్లాడారు.

షబ్బీర్ అలీకి ఇవన్నీ కనబడతలేవా?.. ప్రభుత్వంపై విమర్శలు చేసేటపుడు కాస్త ఆలోచించుకోవాలని సూచించారు. ఏదైనా ఉంటే నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలని హితవు పలికారు. సర్కారు చెప్పినవన్నీ చేస్తుంటే కనబడుతలేవా?, చిత్త శుద్ది ఉంటే రా… మిషన్ కాకతీయలో పాల్గొను, పాత చెరువులో తట్టబట్టి మట్టి మొయ్యి అన్నారు. అసరా పించన్లు నీకు కనబడవా? సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యం నీకు కనబడవా? అన్ని ప్రశ్నించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *