Wednesday, 4 November 2026

అభివృద్ధి పనులు ప్రారంభించిన : ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొన్న కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్

 

కంటోన్మెంట్ జనం సాక్షి జూన్ 13 ఓల్డ్ బోయినపల్లి లో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తో కలిసి ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో రెండు కోట్ల 21 లక్ష 60 వేల రూపాయలతో పలు సిసి రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గం లోని ఓల్డ్ బోయిన్ పల్లి మొదలు 9 డివిజన్ లో పలు సిసి రోడ్డులునిర్మాణంకొరకుశంకుస్థాపననిర్వహించామని,ఎక్కడికక్కడ పనులు పూర్తి చేసుకుంటూ వస్తున్నామన్ని రోడ్లు,మంచినీటి పైప్ లైన్లు,పార్కులు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కొరకు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్ని ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నఎడల తమను సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు.అతి త్వరలోనే పనులు పూర్తవుతాయని దాదాపు 98 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఈఈ గోవర్ధన్,డిఈ బాలకృష్ణ,ఏఈ అరవింద్,ఏఈ అఖిల్,వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, సిహెచ్.పోచయ్య,మన్నే ఉదయ్ యాదవ్,కర్రె లావణ్య,కర్రె జంగయ్య,బల్వంత్ రెడ్డి, మాక్కల నర్సింగ్,గడ్డం నర్సింగరావు,ఎజాజ్,డివిజన్ ప్రెసిడెంట్ ఇర్ఫాన్,డివిజన్ జనరల్ సెక్రెటరీ హరినాథ్,లలిత,ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి,బీసీ సెల్ అధ్యక్షుడుమట్టిశ్రీనివాస్,మైనార్టీసెల్అధ్యక్షుడుజాంగిర్,ఉదయ,రాణి,దుర్గా,శశికళ,రోజా,ఉమా,సంతోషి,దేవి,కవిత,వాణి,కళాంజలి,రాధా,శ్రీలేఖ,గంగమ్మ,మల్లేష్ యాదవ్,చందుయాదవ్, శ్రీనివాస్ రెడ్డి,వేణుగోపాల్ రెడ్డి,పిట్లరాజు, చారి,గణేష్,అశోక్ రాజు,బాలరాజు, రాజుగౌడ్,బాలాజీ,కృష్ణారెడ్డి,సిరాజ్,జె కె,సాదిక్ మొదలగు వారు పాల్గొన్నారు.