Wednesday, 4 November 2026

స్వంత ఊరు మీద ప్రేమతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన -ఎన్ఆర్ఐ డాక్టర్ గండ్ర విద్యాధరరావు.

మల్లాపూర్ జూన్ 13(జనం సాక్షి) స్వంత గ్రామం మీద ప్రేమతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎన్ఆర్ఐ డాక్టర్ గండ్ర విద్యాధరరావు గత 20 సంవత్సరాల క్రితం మండలంలోని సాతరం గ్రామంలో తన సొంత ఇల్లును స్కూల్ కు ఇవ్వగా అది శిథిల వ్యవస్థలో ఉండడంతో దానిని ఐదు లక్షల నిధుల తో వారి తల్లిదండ్రులు గండ్ర నర్సింగారావు రాధమ్మల జ్ఞాపకార్థం మూడు అంగన్వాడి కేంద్రాలను మాడ్రన్ గా తయారుచేసి వాటిని మంగళవారం ఆయన ప్రారంభించారు. అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సౌకర్యం కొరకు ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి వారికి జిరాక్స్ మిషన్ కావాలని అడగడంతో వెంటనే 20వేల చెక్కును వారికి అందజేశారు. ఈ సంవత్సరం పదవ తరగతి లో ఉత్తీర్ణత సాధించిన ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులకు పదివేల నగదును విద్యార్థులకు అందజేశారు. గతంలో అభివృద్ధి చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ మరియు శ్రీ వీరభద్రేశ్వర ఆలయాన్ని సందర్శించి వాటికి కావలసిన నిధులను ఇస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామంలో నిర్మించబోయే ఆరోగ్య కేంద్రం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లవేళలా తన వంతు గ్రామం పై ఎంతటి ఖర్చయినా గాని అభివృద్ధి చేయడానికి తాను ముందు ఉంటానని గ్రామస్తులకు వివరించారు త్వరలో నిర్మించబోయే ఫంక్షన్ హాల్ దాదాపు 40 లక్షల వరకు కు 75% తనవంతు ఇస్తాను మీరు 25 % జమ చేసి ఉంచాలని అన్నారు .దానికి సంబంధించిన ప్లాన్స్ నాకు ఈమెయిల్ ద్వారా పంపాలని అందరికీ సమైక్యములు తెలిపారు.
అనంతరం ఆయనకు శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్, ఉప సర్పంచ్ మెడకోకుల శ్రీనివాస్ ఎంపిటిసి గున్నాల శ్రీనివాస్ అడ్వకేట్ శంకర్రావు, గండ్ర వేణుగోపాలరావు . కార్యదర్శి వినోద్ ,బడే బాలు గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గడ్డం హనుమంత రెడ్డి, బలుసు రెడ్డి ,సుద్దాల మురళి, ఊడుగుల శేఖర్, బ్రహ్మచారి మరియు అచ్చ చిన్న రాజం వార్డు సభ్యులు , అంగన్వాడి టీచర్లు మమత వనిత అన్నపూర్ణ ఆయాలు, గ్రామపంచాయతీ సిబ్బంది నరేష్ రాజం బుర్రయ పాల్గొన్నారు.