Wednesday, 4 November 2026

దశాబ్ది ఉత్సవల్లో భాగంగా జిపి మహిళలకు అంగన్వాడి ఆయాలకు చీరలు పంపిణీ

ఎర్గట్ల జూన్ 13 (జనంసాక్షి):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మహిళలకు. అంగన్వాడి ఆయలక దశాబ్ది ఉత్సవాలలొ భాగంగా తెలంగాణ మహిళా దినోత్సవం కార్యక్రమంలొ చీరలపంపిణీ చేయడం జరిగినది. అనంతరం మండల అధ్యక్షులు ఉపేందర్ మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలొ భాగంగా మహిళలకు చీరలు పంపిని జరిగినదని అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుల్లే లావణ్య గంగాధర్. ఎంపిటిసి మధుసూదన్, మండల బిఆర్ఎస్ అధ్యక్షులు రాజాపూర్ణానందం, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ సున్నపు అంజయ్య,కార్యదర్శి జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.