Wednesday, 4 November 2026

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం
*గుడిహత్నూర్: జనవరి 5( జనం సాక్షి అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ దేర్యమని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు గురువారం గుడిహత్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల పథకం ప్రకారమే ఆసరా పింఛన్ రైతుల కొరకు రైతుబంధు, రైతు భీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద వ్యాపారస్తుల వద్ద అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేది నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఎస్సీ ఎస్టీ ,బిసి, మైనార్టీ ఆడపిల్లలకు అన్ని వర్గాల ప్రజలకు కు అండగా ఉంటానని కల్యాణలక్ష్మి రూపంలో మొదటి 50,000 నుంచి, నేడు లక్ష నూట పదహారు రూపాయలు అందించడం జరుగుతుందన్నారు ఆడపడుచులకు సీఎం కేసీఆర్ అండగా పెద్దన్నగా నిలిచారు . మహిళలు ఈ కళ్యాణలక్ష్మి డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏడు లక్షల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి, మరమ్మత్తుల పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపిడిఒ సునీత, డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, సర్పంచులు తిరుమల్ గౌడ్, సోయం దస్రు,ఎంపీటీసీ లు సాగిర్ ఖాన్, కేంద్రే న్యాను, కో ఆప్షన్ సభ్యుడు షేక్ జమీర్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బూర్ల లక్ష్మీ నారాయణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్,నాయకులు సంగ ఆశన్న యాదవ్, సంతోష్ గౌడ్, జలందర్, మాల్కు, తదితరులు పాల్గొన్నారు