Wednesday, 4 November 2026

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన-జడ్పీటీసీ అనిల్ జాధవ్

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన-జడ్పీటీసీ అనిల్ జాధవ్.
నెరడిగొండజనవరి5(జనంసాక్షి):యువకుల అభిప్రాయం ప్రకారం ఈ క్రికెట్ టోర్నీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిని అందిస్తానని హామీ ఇచ్చారు.క్రీడల వలన మానసిక ఒత్తిడి తగ్గుతుందని అనిల్ జాధవ్ అన్నారు. మండలంలోని చిన్న బుగ్గారాం గ్రామంలో ప్రతీ సంవత్సరం లాగే నిర్వహించే మండల స్థాయి క్రికెట్ పోటీలను అనిల్ జాదవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ బలరాం జాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో యువకులు క్రీడలలో రాణించి రాష్ట్ర స్థాయి,జాతీయస్థాయిలలో గుర్తింపు పొందలని అన్నారు.