ఘనంగా మొదలైన ఉర్సు ఉత్సవాలు
రాయికోడ్ జనం సాక్షి జనవరి 05 రాయికోడ్ మండల పరిధిలోని హస్నాబాద్ గ్రామంలో ఈనెల 5 నుండి 9వ తేదీ వరకు శ్రీ శ్రీ శ్రీ అజరత్ శంశర్ తబ్రెష్ హుర్స్ ఉత్సవాలు జరుగుతాయని స్థానిక సర్పంచ్ పుర్ర హనుమంతు, ఎంపీపీ మమత అశోక్, ఉపసర్పంచ్ జైపాల్ తెలిపారు. గురువారం నాడు సర్కారీ గంధము నిర్వహిస్తారు. శుక్రవారం రోజు హస్నాబాద్, ఔరంగ నగర్ , ఎన్కేపల్లి మరియు కోడూరు గ్రామమల చిన్న పెద్ద గంధము ఉంటుంది. శనివారం ఖవాలి, దీపాల పండుగ, ఆదివారం సంస్కృతిక కార్యక్రమాలు, భారీ జాతర, సోమవారం మల్లయోధులచే కుస్తీ పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు హస్నాబాద్ గ్రామ ప్రజలకు మరియు చుట్టూ పది కిలోమీటర్ల పరిసర ప్రాంతాల వారికి పాల్గొనడానికి అవకాశం లేదు. తదుపరి అనంతరం అందోల్ శాసనసభ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పాల్గొని బహుమతులను అందజేస్తారని నిర్వాహకులు తెలిపారు.




