Wednesday, 4 November 2026

ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.

ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.
బెల్లంపల్లి, నవంబర్ 29, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణ నూతన ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం మంగళవారం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా పాత భాస్కర్, కార్యదర్శులుగా ఎలుక వెంకటేష్, బాల రాజన్న, అదనపు కార్యదర్శిగా నరేందుల వేణుగోపాల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షునిగా పుల్లూరి వెంకటేష్, సెక్రటరీగా బాల సంతోష్, ట్రెజరీలుగా బాల ప్రశాంత్, నల్మాస్ సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలివేరు శ్రీధర్, జాయింట్ సెక్రటరీగా కొడితల బాల ప్రసాద్, కన్వీనర్ గా నరేందుల రామకృష్ణ, సామల కిరణ్, కౌటారం గణేష్, కోర్ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్, వజ్జల కిరణ్, డొంతుల రామకృష్ణ, కాసనగొట్టు శశిథర్, ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలుగా బాల విజయలక్ష్మి, సెక్రటరీగా పల్లెర్ల సింధుజ, ట్రెజరీగా చిలువేరు నికిత, పిఆర్ఓగా నరేంద్రుల లక్ష్మి, కన్వీనర్ గా నరేందుల సంజన, ప్రమాణ స్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేణిగుంట్ల శ్రీనివాస్, చిలివేరు వైకుంఠం, ముక్తా శ్రీనివాస్, పాల్గొన్నారు