Tuesday, 3 November 2026

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి. అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.

అలంపూర్ జూలై 5(జనంసాక్షి)రాష్టం లో అమలు చేస్తున్నా అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు లో దేశానికే తెలంగాణ అగ్రగామిగ నిలుస్తుంది అని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. బుధవారం
అలంపూర్ మండలం భీమవరం గ్రామంలో 20 లక్షలు మరియు, ఊట్కూరు గ్రామంలో 10 లక్షల రూపాయల తో సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు.భూమి పూజ కార్యక్రమనీకి అలంపూర్ ఎంపీపీ .P.బేగం మరియు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాతే రోడ్ల‌కు మ‌హ‌ర్ద‌శ వ‌చ్చింద‌ని ఆయన అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్ర‌తి ప‌ల్లెప‌ల్లెకు రోడ్లు రావ‌డ‌మే కాకుండా ప్ర‌తి గ్రామంలోనూ అంత‌ర్గ‌త రోడ్లు కూడా వ‌చ్చాయ‌ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ తెచ్చిన సీఎం కెసిఆర్ చొర‌వ తీసుకుని చేస్తున్న అభివృద్ధిగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.అలంపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకుశక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల చేతుల్లో నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురైన అనేక గ్రామాలు టీఆర్ఎస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయ‌లు ఇవ్వాల మంజూర‌వుతున్నాయ‌ని ఆయన అన్నారు.అన్ని ర‌కాల ప‌థ‌కాలు క‌లుపుకుంటే, ఒక్కో గ్రామానికి కోట్ల రూపాయ‌లు వ‌స్తున్నాయ‌ని ఎమ్మెల్యే వివ‌రించారు. ఇంత అభివృద్ధి గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేద‌న్నారు. ప్ర‌తి గ్రామానికి రోడ్లు వేయ‌డం ద్వారా అభివృద్ధికి బాటలు వేయ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు BRS పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.