వికారాబాద్ రూరల్ జూలై 5 జనం సాక్షి
ధరూర్ సిఐగా పదవి బాధ్యతలు చేపట్టిన రామకృష్ణ మోమిన్ పేట సబ్ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టి న విఠల్ రెడ్డి లు బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను పుష్పగుచ్చాలు అందించి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని రాజకీయాలకతీతంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వాటిని సూచించారు నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు
వికారాబాద్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ధరూర్ సిఐ రామకృష్ణ మోమిన్ పేట సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ రెడ్డి




