Tuesday, 3 November 2026

అభిషేక్ యాదవ్ జన్మ దినం పురస్కరించుకొని ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన కుటుంబ సభ్యులు

 :శామీర్ పేట్, జనం సాక్షి : కుమారుడు అభిషేక్ యాదవ్ జ్ఞాపకార్ధం సుభాష్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం జగంగూడ లోని మానసిక ఆరోగ్యం సరిగా లేని 250 మంది అనాధలకు బొల్లెబోయిన సుభాష్ యాదవ్ తన యువ కుమారుడు రోడ్ ప్రమాదంలో చనిపోయిన అభిషేక్ యాదవ్ జన్మ దినం పురస్కరించుకొని ఆనాధలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి చంద్ర శేఖర్ యాదవ్, తుంకుంట 5వ వార్డు కౌన్సిలర్ రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.