మునిపల్లి, మే 29, జనంసాక్షి: పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు పథకంలో భాగంగా కొత్తగా పట్టా పాస్ బుక్ వచ్చిన రైతులందరు రైతుబంధు పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సోమవారం మునిపల్లి మండల వ్యవసాయ అధికారి శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రైతుబంధు రానివారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)లకు అందజేయాలని చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.




