Tuesday, 3 November 2026

చెరువులను కబ్జా చేస్తె సహించేది లేదు: ఎమ్మెల్యే.

మల్కాజిగిరి.జనంసాక్షి.మే29.చెరువులను కబ్జా చేస్తె సహించేది లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చరించారు.మౌలలి డివిజన్ పరిధిలోని ఆర్టీసి కాలని బండ చెరువు ను ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు అధికారులతో కలిసి పరిశీలించారు.దశాబ్ది ఉత్సవాలలో బండ చెరువు సుందరీకరణ కు తగిన చర్యలు తీసుకుంటామని చెరువు కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డీఈ మహేష్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్,మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,సతిష్ కుమార్,పిట్ల శ్రీనివాస్,గుండా నిరంజన్,రామూయాదవ్,సత్తయ్య, ఫైజల్,ఆదినారాయయనా,సందీప్ గౌడ్,రఘు యాదవ్,సంతోష్ రాందాస్,తదితరులు పాల్గొన్నారు.