Tuesday, 3 November 2026

అభ్యసన సామాగ్రి మేళను ప్రారంభించిన ఎంపీపీ రాజారెడ్డి

అభ్యసన సామాగ్రి మేళను ప్రారంభించిన ఎంపీపీ రాజారెడ్డి

 

మల్దకల్ జనవరి 3 (జనంసాక్షి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారము మండల స్థాయి బోధన అభ్యసన సామాగ్రి మేళను ఎంపీపీ వై రాజారెడ్డి,సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఆయా పాఠశాలల నుండి తీసుకొచ్చిన సామాగ్రి మేళ్లను స్స్టాల్స్ లలో పరిశీలించారు. కాంప్లెక్స్ పరిధిలో ఎంపిక చేసిన పాఠశాల నుండి టి ఎల్ ఎం మెటీరియల్ ను ప్రదర్శించారు.జిల్లా స్థాయిలో జరిగే టి ఎల్ ఎం మేళకు మండల స్థాయినుండి జిల్లా స్థాయికి మూడు పాఠశాలలు ఎంపిక చేశారు.పెద్దపల్లి,నాగర్ దొడ్డి,అమరవాయి పాఠశాలలు ఎంపికయ్యాయి.ఎంపికైన పాఠశాలలకు ప్రశంస పత్రాలను ఎంపీపీ రాజారెడ్డి, సింగల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి సర్పంచ్ యాకోబు చేతులమీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కొండారెడ్డి పాఠశాల హెచ్ఎం ఇమ్మానియేలు,అమరవాయి పాఠశాల హెచ్ఎం జానకమ్మ,విద్యా కమిటీ చైర్మన్ తిమ్మప్ప, స్థానిక నాయకులు నరేందర్, ఉప్పరి నారాయణ, ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, ఆర్పీలు సీతం నాయుడు, శ్రీకాంత్, రిటైర్డ్ ఎంఈఓ స్వామి,ఆర్ట్స్ టీచర్ అమృత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.