Tuesday, 3 November 2026

రసాయన ఎరువుల విక్రయాల పై లోకేశ్వరం ఎమ్మార్వోకు ఫిర్యాదు

రసాయన ఎరువుల విక్రయాల పై లోకేశ్వరం ఎమ్మార్వోకు ఫిర్యాదు

భైంసా రూరల్ జనవరి 03
జనం సాక్షి

అధిక ధరలకు రసాయన ఎరువులను విక్రయిస్తూ రైతులను దోపిడీకి గురి చేస్తున్న ఎరువులు, విత్తనాల దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం లోకేశ్వరం ఎమ్మార్వోకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ.. మామూళ్లకు అలవాటు పడిన వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భైంసా డివిజన్‌లో రసాయన ఎరువులు, విత్తనాల వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ.. రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.