అభ్యసన సామాగ్రి మేళను ప్రారంభించిన తహసిల్దార్ శ్రీనివాసరావు
టేకులపల్లి, జనవరి 4(జనంసాక్షి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారము మండల స్థాయి బోధన అభ్యసన సామాగ్రి మేళను తహసిల్దార్ కె.వి శ్రీనివాసరావు, ఎంపీపీ భూక్య రాధ, ఎంఈఓ రామ్ సింగ్ ఠాకూర్ లు ప్రారంభించారు. బుధవారం ఆరు కాంప్లెక్స్ లలో ఆయా పాఠశాలల నుండి తీసుకొచ్చిన సామాగ్రి మేళ్లను స్స్టాల్స్ లలో పరిశీలించారు. కాంప్లెక్స్ పరిధిలో ఎంపిక చేసిన పాఠశాల నుండి టి ఎల్ ఎం మెటీరియల్ ను ప్రదర్శించారు. ఎంపికైన పాఠశాలలకు ప్రశంస పత్రాలను ఎంపీపీ భూక్య రాధా, గోలియా తండా సర్పంచ్ బోడ నిరోషా, ఎంఈఓ రామ్ సింగ్ ఠాకూర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ హరికిషన్ నాయక్, కాంప్లెక్స్ లో ప్రధానోపాధ్యాయులు మోడల్ ఆఫీసర్ జగన్, విభిన్న సంఘాల ప్రతినిధులు, మండల జిల్లా నాయకత్వం విధిగా పాల్గొని టిఎల్ఎం ఔన్నత్యాన్ని కొనియాడారు. అనంతరం ప్రతి సబ్జెక్టు నుండి ఐదుగురిని సెలక్షన్స్ చేసి ప్రశంసా పత్రాలను అందజేశారు.




