Wednesday, 4 November 2026

నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తున్న సర్పంచ్

నూతనంగా నిర్మించిన పెట్రోల్ బంకును ప్రారంభిస్తున్న సర్పంచ్ నీల కుమారస్వామి అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ కుమార్ సింగ్

వీణవంక జనవరి 4 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సర్పంచ్ నీల కుమారస్వామి ఇండియన్ ఆయిల్ కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ కుమార్ సింగ్ అన్నారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అచ్యుతానంద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను బుధవారం సర్పంచ్ నీల కుమారస్వామి అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ కుమార్ సింగ్ నాయకులతో కలిసి ప్రారంభించారు స్థానిక వేద పండితులు గూడ జగదీశ్వర్ శర్మ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెట్రోల్ బంకును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ దారులు ఎక్కువ ఉండడం వలన నాణ్యమైన పెట్రోల్ డీజిల్ విక్రయించడానికి బంకును ఏర్పాటు చేయడం జరిగిందని పెట్రోల్ బంక్ నిర్వాహకులు గడ్డం సదానందం గడ్డం రామచందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ మెంబర్ అబ్దుల్ హమీద్ స్థానిక నాయకులు రాంపల్లి రాములు నీల మొండయ్య. కాసనగొట్టు వెంకటరమణ. కాసనగొట్టు లక్ష్మయ్య ప్రముఖ వ్యాపారవేత్త కాసనగొట్టు వెంకటరమణ అల్లంకి సాంబమూర్తి అల్లంకి కృష్ణమూర్తి. ఎండి నసీరుద్దీన్.ఎండి నవాజో ద్దీన్ ఎండి సాహెబ్ హుస్సేన్. దాసరపు ప్రకాష్ తోపాటు గ్రామస్తులు వాహనదారులు తదితరులు పాల్గొన్నారు