Wednesday, 4 November 2026

ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విద్య

ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన విద్య..
– ఉపాధ్యాయుల బోధన అభినందనీయం.
– జడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి రవీందర్.
ఊరుకొండ, జనవరి 4 (జనంసాక్షి):
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందేలా చర్యలు తీసుకుంటుందని.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి విద్యాబోధన చేయడం అభినందనీయమని జడ్పీ చైర్ పర్సన్ శాంతకుమారి రవీందర్
అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ బాస్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విద్యా బోధన సామాగ్రినీ(టీఎల్ఎమ్) తీసుకువచ్చి అద్భుతంగా నిర్వహించిన మండల స్థాయి టి ఎల్ ఎమ్ మేళా కార్యక్రమానికి జడ్పీ చైర్ పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎంతగానో కష్టపడి విద్యా బోధన సామాగ్రిని సమకూర్చడం.. వాటిని విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. తెలుగు భాషా పరిజ్ఞానంలో రాజాలపల్లి, మాదారం, ఊరుకొండ పేట పాఠశాలలు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచాయి. ఇంగ్లీష్ భాష పరిజ్ఞానంలో ఊరుకొండ పేట, ముచ్చర్లపల్లి, బొమ్మరాజు పల్లి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచాయి. గణిత శాస్త్రంలో రాచాలపల్లి, బాల్య లోక్యా తండ, రేవల్లి గ్రామాల ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచాయి. పరిసరాల విజ్ఞానంలో ముచ్చర్లపల్లి, రాచాలపల్లి, ఊరుకొండ పేట ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచాయని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన వారికి ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ కలీం పాషా, ఎంఈఓ బాసు నాయక్, మండల నోడల్ ఆఫీసర్ వెంకటరమణ, ఎంపిడిఓ ప్రభాకర్, క్లస్టర్ ప్రధానోపాద్యాయులు శ్రావణ్, పాఠశాల ప్రధానోపాద్యాయులు బాలయ్య, ఎస్ ఎమ్ సి చైర్మన్ రజిత, ఉప సర్పంచ్ నారాయణ, ఉపాధ్యాయ సంఘం నాయకులు వెంకటేశ్వర్ గౌడ్, సత్యనారాయణ, పర్వతాలు, రాములు, లక్ష్మణ్, చంద్రశేఖర్, లక్ష్మీనరసింహ, రిసోర్స్ పర్సన్స్ శ్రీనివాసులు, రఘురాం, వెంకటేశ్వర్లు, సుబాన్, జమీల్, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.