అమరవాయి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి
మల్దకల్ జనవరి 11 (జనంసాక్షి)నిర్మల్ జిల్లాలోని ఈ నెల 9 తేదీ నుండి 11 వరకు నిర్వహించిన 50వ రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక పర్యావరణ,ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్ ప్రదర్శన – 2023లో అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్యం,ప్రవీణ్ లు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ లో మన కోసం గణితంఅనే విభాగంలో రాష్ట్ర స్థాయి తృతీయ బహుమతి గెలుపొందారు.ఈ విద్యార్థులు జనవరి నెలాఖరులో కేరళ లోని తిరుచ్చిలో జరిగే దక్షిణ భారత స్థాయి పోటీలకు సైతంఎంపిక కావటం జరిగింది.ఈ విద్యార్థులకు గైడ్ టీచర్ గణిత ఉపాధ్యాయురాలు.అనితవ్యవహరించారు. విద్యార్థులకు బహుమతులను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,జిల్లా కలెక్టర్,జిల్లా విద్యా శాఖాధికారి రవీందర్ రెడ్డి అందజేశారు.ఈ పోటీల్లో మన కోసం గణితం విభాగంలో ప్రతి జిల్లా నుండి జిల్లా స్థాయిలో మొదటి బహుమతి పొందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులనుగైడ్ టీచర్ అనితని ప్రధానోపాధ్యాయులు జానకమ్మ పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో ఇద్దరు విద్యార్థులకు అవార్డు రావడం పట్ల ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ,విద్య కమిటీ చైర్మన్ ఆనందం,టిఆర్ఎస్ నాయకుడు తూము కృష్ణారెడ్డి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.




