రాష్ట్రీయ విద్యార్ధి సేన పరిషత్ క్యాలెండర్ ఆవిష్కరణ
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రీయ విద్యార్ధి సేన పరిషత్ నూతన సంత్సర క్యాలెండర్ ను డీఐఈఓ ప్రభాకర్ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ సైదులు, సంఘ గౌరవ సలహాదారులు గుండు లక్ష్మీనారాయణ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆర్వీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై తమ సంఘం అలుపెరుగని పోరాట చేస్తుందన్నారు.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షులు చామకురి మహేందర్, పట్టణ కార్యదర్శి షరీఫ్, జిల్లా నాయకులు దినేష్ , సతీష్ , తరుణ్, వాసు, శివ, గౌతమ్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.




