సీఎం సారూ మీరిచ్చిన హామీలేవి…?
– భద్రాద్రి రామయ్య కి 100 కోట్లు ఏవి…?
– అమలుకు నోచుకోని హామీలు… జర గుర్తుందా… మా జిల్లాకు వస్తున్నారు…..?
– అర్హులకు అందని ముంపు సాయం రూ. 10000.
– మండల బి జె పి అద్యక్షుడు సాయి శ్రీను..
బూర్గుంపహాడ్ జనవరి 11 (జనంసాక్షి)
భద్రాద్రి రామయ్య కి 100 కోట్లు ఇస్తానని ఏండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీ నెరవేరలేదని మండల బిజెపి అధ్యక్షుడు సాయి శ్రీను అన్నారు. ఆయన మాట్లాడుతూ 2022 జూలై 17న భద్రాద్రి సీఎం పర్యటనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీఎం సారూ పోలవరం చెక్ డ్యాం తో భద్రాద్రి జిల్లాలో ఎన్ని గ్రామాలు కొట్టుకు పోనున్నాయో మీకు ఎరుకనా…? నేతి బీరలో నేయి చందమే అన్న రీతిగా
గోదావరి మునకకు గురైన ఇళ్లకు తక్షణసాయంగా అందించే 10,000 రూపాయలు నిజమైన అర్హులకు పరిహారం అందని పేద వారెందరో మీకు ఎరుకనా…? జిల్లాలో పోడు భూముల సమస్యలు ఎట్లున్నయో మీకెరుకనా….? ముంపు బాధితులకు పునరావాసం కల్పిస్తానన్న హామీ ఇంతవరకు ఆ ఊసే లేదని ఆయన వాపోయారు. ఇచ్చిన హామీలేవి నెరవేర్చకుండా జిల్లాకు సీఎం మళ్లీ రావడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు




