Thursday, 5 November 2026

అమరవీరులకు కుటుంబలకు పెన్షన్ ఉద్యోగం కల్పిస్తా… తెలంగాణలో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ అమలు చేస్తాం.

 

 

 

 

 

భువనగిరి టౌన్( జనం సాక్షి ):–తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత యువతకు తొలి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ భృతిని అమలు పరుస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈనెల 8న హైదరాబాదులోని సరూర్నగర్ లో ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను అమలుపై జిల్లా కేంద్రంలోని రహదారి బంగ్లాలో జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 2004వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ అమలు చేస్తామని అన్నారు. ఉద్యోగ కల్పనతో పాటు నిరుద్యోగులకు 4వేలు భృతి తెలంగాణ సాధనలో అమరవీరులైన కుటుంబాలకు నెలకు పెన్షన్లు 25 వేలు పెన్షన్ తో పాటు అర్హులైన వారికి ఒకరికి ఉద్యోగం కల్పించి వారిని గౌరవిస్తామని అన్నారు. జాబ్ క్యాలెండర్ను అమలు చేసి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.
తెలంగాణ యువత రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ యువశక్తి లో పాల్గొని బహుమతులు సాధించాలని వారు తెలిపారు
పాల్గొనేవారు సెల్ నెంబర్ 8142903456 నెంబర్ను సంప్రదించి సందేహాలను తెలుసుకోవచ్చని అన్నారు
రైతుల ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం పూర్తిగా వహిస్తుందని నేటికీ రైతుల కల్లాలలో 70 శాతం ధాన్యము కొనుగోలు చేయలేకపోయారని అన్నారు. తరుగు పేరిట ధాన్యము క్వింటాలుకు 20 కేజీల ధాన్యాన్ని తొలగించడంతో రైతుల నష్టపోతున్నారని అన్నారు. దీంతోపాటు రైస్ మిల్ యజమానులు లారీ యజమానులు అధికారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని ధాన్యం కొనుగోలు చేయకపోవడం రైతులకు తీరని ఇబ్బందులు కలిగిస్తున్నారని వెంటనే రైతుల కల్లాల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. త్రిబుల్ ఆర్ రోడ్ త్రీడి వచ్చిన పిదప స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి హడావిడి చేసి రైతులకు ఏదో మేలు చేస్తున్నట్లుగా మున్సిపల్ లో తీర్మానం చేయించడం ఏమిటని చేతనైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర కూర్చొని రైతుల భూములను కాపాడాలని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయని వనరుల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ డెలిగేట్ మేంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, ఎంపీపీ నూతి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, నక్కల ఆదినారాయణ ,కౌన్సిలర్లు వడిచర్ల లక్ష్మి కృష్ణ యాదవ్, కైరం కొండ వెంకటేష్, నజియ సల్లావుద్దీన్ గంగాధర్ మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుబాబు, వల్లందాస్
ఆదినారాయణ, బిస్కుంట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.