
భువనగిరి టౌన్( జనంసాక్షి):–తెలంగాణ రాష్ట్ర కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలు నెరవేర్చలాని వడాయిగూడెం సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం గ్రామ పంచాయతి కార్యాలయం వద్ద జరిగిన అమరవీరుల దినోత్సవంలో పాల్గొని ప్రసంగించారు.
అమరవీరుల త్యాగాలు వృదా కావని కొనియాడారు. వారి త్యాగాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా పంచాయతి కార్యాలయం అవరణలో జరిగిన సమావేశంలో అమరులకు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సంస్మరణ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నీల పోశెట్టి గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆమని, వార్డు సభ్యులు కళ్లెం గౌడ్, బబ్బూరి సాగర్ గౌడ్, చుక్కల కమలమ్మ, కోట పోచయ్య, ఎశబోయిన లక్ష్మి, కోట స్వామిదాస్, ఫీల్డ్ అసిస్టెంట్ బబ్బూరి శంకర్ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బబ్బూరి పోశెట్టి గౌడ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య యాదవ్, గుండు రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




