భువనగిరి:. టౌన్ జనం సాక్షి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ పట్టణ కన్వీనర్ గా భువనగిరి భువనగిరి పట్టణానికి చెందిన తాడూరి బాలరాజును నియమిస్తూ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ భువనగిరి పట్టణంలోని రహదారి బంగ్లాలో మంగళవారం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. తనపై నమ్మకంతో తన నియామకానికి కృషిచేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షుడు రాహుల్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు , తదితరులు పాల్గొన్నారు 
భువనగిరి పట్టణ ఓబిసి కన్వీనర్ గా తాడూరి బాలరాజు నియామకం




