Wednesday, 4 November 2026

ఈదమ్మ తల్లి కళ్యాణం బోనాల ఉత్సవాలు కరపత్రం విడుదల

భువనగిరి టౌన్ (జనం సాక్షి):—రజకుల కులదైవమైన ఈదమ్మ తల్లికళ్యాణంమరియుబోనాలమహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని తేదీ 7 -7 -2023 శుక్రవారం నుండి 9 -7 -2023 ఆదివారం వరకు భువనగిరి పెద్ద చెరువు వద్ద ఉన్న ఈదమ్మ తల్లి దేవాలయం వద్ద రజకులు అందరూ కలిసి సామూహికంగా ఈ కార్యక్రమాన్ని మూడు రోజులు పాటు నిర్వహించాలని ఈ యొక్క కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈదమ్మ తల్లి ఉత్సవ సమితి అధ్యక్షులు చల్లగురువుల రఘుబాబు గారు .ఇదమ్మ తల్లి దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి భువనగిరి పట్టణ రజక కులస్తులం అందరం కలిసి ఇదమ్మ తల్లి కళ్యాణం బోనాలు ఎంతో ఘనంగా నిర్వహించాలని ఆలయం దగ్గర అన్ని రకాల ఏర్పాటును నిర్వహిస్తామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తామని ప్రతి ఒక్కరం భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని మాట్లాడడం జరిగింది .ప్రధాన కార్యదర్శి రత్నాపురం శ్రీశైలం నీలం లక్ష్మీనారాయణ భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్స్ రత్నాపురం బలరాం ఉదరి లక్ష్మీ సతీష్ జనగాం నరసింహ చారి కోళ్ల గంగాధర్ నీలం రమేష్ రత్నాపురం పద్మ కుంచెం బాలు కుంచెం విజయ్ మైలారం శ్రీనివాస్ రత్నాపురం విక్రమ్ నీలం సత్యం అజయ్ ప్రవీణ్ శ్రీనివాస్ ముదిగొండ శ్రీను ముదిగొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు