మల్కాజిగిరి.జనంసాక్షి.జూన్22తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మల్కాజిగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జార్జి విల్సన్, గడ్డమీది యాదగిరి పేర్కొన్నారు.గురువారం తెలంగాణ దశాబ్ది ముగింపు ఉత్సవాలలో భాగంగా ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో మల్కాజిగిరి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. అమరవీరుల త్యాగాలు వృధా కావని, వారి ఆశయ సాధనాల కోసం తెలంగాణ ప్రజలు ఎల్లవేళలా కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జర్నలిస్టులు శివ గౌడ్, సాయికిరణ్,సంతోష్,ఓం,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి




