Wednesday, 4 November 2026

తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు చిరస్మరణీయం -జడ్.పి. చైర్ పర్సన్ సరిత.

గద్వాల నడిగడ్డ, జూన్ 22 (జనం సాక్షి);తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు చిరస్మరణీ యమని జిల్లా జడ్ .పి. చైర్ పర్సన్ సరిత అన్నారు.తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన గురువారం తెలంగాణ అమరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని స్మృతి వనం నందు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్, గద్వాల్, ఆలంపూర్ శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, డాక్టర్ అబ్రహం , మున్సిపల్ చైర్మెన్ బి ఎస్ కేశవ్ , గ్రంథాలయ చైర్మెన్ జంబు రామన్ గౌడ్, మార్కెట్ చైర్మెన్ శ్రీదర్ గౌడ్ లతో కలిసి అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా జాడ్ పి చైర్మెన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. అపుడు వారు చేసిన త్యాగాలకు పలితంగా తెలంగాణా లో వారికీ నివాళులు అర్పించు కుంటున్నామని,నాటి ఉద్యమంలో అమరుల త్యాగాల ఫలితంగానే రాష్ట్రం ఏర్పడి నేడు తెలంగాణా రాష్రం అభివృధి చెందిదని , అమరులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకేల్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. జిల్లా అభివృధి జరగాలంటే మీ అందరి సహకారం ఉండాలని అన్నారు.జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ తెలంగాణా రాష్రం ఏర్పడి 9 సంత్సరాలు పూర్తి చేసుకొని 10 వ సంవత్సరంలో ఉన్నందున, 9 సంవత్సరాలు సాదించిన ప్రగతిని జూన్ 2 నుండి ఈ రోజు వరకు దశాబ్ది ఉత్సవాలు జరుపు కుంటున్నామని, చివరి రోజు అమరుల సంస్మరణ సభ నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తెలంగాణా ప్రభుత్వం ఉద్యమం లో పాల్గొని అమరులైన వారిని గుర్తించి వారికి న్యాయం జరగాలని వారి యొక్క స్మారకచిహ్నాలను ప్రారంభించుకునామని అన్నారు.
గద్వాల శాశనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ శాంతి యుతంగా తెలంగాణా రావాలనే ఉద్దేశ్యం తో తెలంగాణా ఉద్యామానికి పునాది వేసి రాష్ట్ర ముఖ్య మంత్రి యావత్తు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని, తెలంగాణ ఉద్యమం లో చాలా మంది ప్రాణాలు కోల్పోయి అమరులైనారని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత పాలమూరు, ఎతిపోతల పథకం తెసుకువచ్చి 2014 లో 14 వేల ఎకరాలు ఉంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1.30 వేల ఎకరాలకు నీటి సౌకర్యం అందించిన ఘనత తెలంగాణా ప్రభుత్వందే నని , వ్యవసాయ రంగం ఆర్థికంగా అభివృధి చెందిందని అన్నారు.
ఆలంపూర్ శాశనసభ్యులు డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ గతంలో 54 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం చేయని అభివృధి తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు అయి న తర్వాత జరిగిందని, తెలంగాణ కొరకు 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు అర్పించి అమరులయ్యారని , వారిని ఈ సందర్బంగా స్మరించుకోవటం అభినందనీయమని అన్నారు.
తెలంగాణా ఇంజనీర్ అసోసియేషన్ ప్రసిడెంట్ శ్యాం సుందర్ రెడ్డి, వెంకట్ రంగ రెడ్డి, మోహన్ రావు తదితరులు మాట్లాడారు.
అనంతరం పాత బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన తెలంగాణా రాష్ట్ర ఉద్యమం లో అమరులైన పాశం సర్వా రెడ్డి, కొట్టం వేణుగోపాల్ గార్ల విగ్రహాల ఆవిష్కరణ గావించి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గద్వాల తహసిల్దారు వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ నర్శిములు , శ్యాం ప్రసాద్ రెడ్డి, వెంకట రంగా రెడ్డి, రమేష్, మోహన్ రావు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, అమరవీరుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.