డోర్నకల్ జూన్ 22(జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని స్థానిక సర్పంచ్ గుగులోత్ దేవిశంకర్ నాయక్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం హున్య తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో అమరవీరుల స్థూపం చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించి అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది తమ జీవితాలనే త్యాగం చేసిన అమరవీరులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి లక్ష్మయ్య, అంగన్వాడీ టీచర్స్ సంధ్య, పార్వతి, ఆశా వర్కర్స్, ఆయాలు బీబీ, ఎంపీపీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు టి రమేష్, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన -హున్యతండా గ్రామ ప్రజాప్రతినిధుల అధికారులు




