
గద్వాల నడిగడ్డ, జూన్ 22 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో టిఎన్జీవో భవనంలో గురువారం తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు మాట్లాడుతూ 1969 ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాల ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఆశయాలను నెరవేర్చడంలో, తెలంగాణ ప్రభుత్వము విఫలం చెందిందనీ వివిధ ప్రజా నాయకులు ఆరోపించారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వము విఫలం చెందిందని, రైతాంగం విషయంలో రుణమాఫీ చేయడంలో, గిట్టుబాటు ధర కనిపించడంలో చిత్తశుద్ధి లోపించిందనీ,,రాష్ట్రం ఏర్పడితే మా పిల్లలకు కొలువులు వస్తావని భావించిన రైతులు,కార్మికులు , శ్రామికుల, వ్యవసాయ కూలీలు ప్రభుత్వ తీరు ఘోరంగా ఉందని భావిస్తున్నారు, ప్రభుత్వం ఏర్పాటులో ఉన్న ధ్యాస ప్రజాసంక్షేమం పైన ఆలోచించడం లేదనీ,ఉచితల పేరు మీద ,కులాలవారీగా పథకాల పేరుమీద ప్రజలను మభ్యపెడుతూ ,తెలంగాణ అమరుల ఆకాంక్షను గుర్తించడంలో నిర్లక్ష్యం చేసిందని ప్రజలు , మేధావులు, ఉద్యోగులు, ఉద్యమకారులు భావిస్తున్నారనీ,. బంగారు తెలంగాణలో ప్రజలను మభ్యపెట్టి అగ్రవర్ణ రాజకీయ పాలన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ,రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతామని నిరుద్యోగులు ,రైతులు, వివిధ సంఘాల నాయకులు ప్రభుత్వ తీరు సరిగా లేదని మాట్లాడడం జరిగింది, ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు భాహుజన రాజ్యసమితి, సిపిఐ,ఐ ఎఫ్ టి యు,టీ వై ఎస్ ఆర్ సి పి, బీఎస్పీజన సేన , దళిత ఐక్యవేదిక, టీవీవి,, పాలమూరు అధ్యయన వేదిక, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,. ఎం వాల్మీకి ,కే వినోద్ కుమార్, కోళ్ల ఉసెన్, నాగర్ దొడ్డి వెంకట రాములు,ఆంజనేయులు,సి. వెంకట్ రెడ్డి. ,పిడిఎస్ రాజు ,నాగన్న ,బీరెల్లి దానయ్య , పుల్లయ్య, గోపాల్ రావు , మోహన్ మద్దిలేటి, టవర్ మక్బూల్, ఎల్కూరు రంగన్న సాధతుల్లా..వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




