మల్కాజిగిరి,జనంసాక్షి.జూన్.22
విధి నిర్వహణలో ఎలాంటి అవినీతికి తావివ్వకుండా తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్న మల్కాజిగిరి తహసిల్దార్ వెంకటేశ్వరరావు స్థానిక ప్రజల్లో,ఆర్జిదారులలోఅభిమానాన్నిచూరగొంటున్నారు.గురువారము నేరేడ్ మెట్ ప్రాంతానికి చెందిన కార్తిక్ ఓ వికలాంగుడు.కుల,ఆదాయ ద్రువీకరణ పత్రాల కోసం గత నాలుగు రోజుల క్రితం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు.తనకు సహకారాన్ని అందించే వారు ఎవరూ లేకపోవడంతో ఓలా బైక్ ని బుక్ చేసుకుని కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం గత మూడు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆ వికలాంగునికి పని కావడం లేదు.గురువారం కార్యాలయానికి వచ్చిన కార్తిక్ ను, అప్పుడే కార్యాలయానికి వస్తున్న తహశీల్దార్ వెంకటేశ్వర్ రావు చూసి అతన్ని వాకబు చేయగా వచ్చిన విషయాన్ని తహసిల్దార్ కు కార్తిక్ విన్నవించారు.వెంటనే ఇవ్వాల్సిన కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు ఆర్ఐ తో రిపోర్ట్ రాయించి ఐదు నిమిషాలలో ఆ వికలాంగునికి కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలను ఉన్నచోటనే తహసిల్దార్ అతనికి అందించారు.యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనను చూసిన స్థానిక ప్రజలు,కార్తీక్ కు అందించిన సేవలను చూసి మంత్రముగ్ధులయ్యారు.తను నిర్వహిస్తున్న విధి నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా,అవినీతికి తావు లేకుండా చేస్తున్న కృషి ఏనలేనిదని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.తహసిల్దార్ వెంకటేశ్వరరావును ఇటీవల జిల్లా ఉత్తమ ఉద్యోగి గా అవార్డు ను అందుకోవడం జరిగింది.తాను ఏ ఉద్యోగం చేసిన అక్కడ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటానని ఆయన ఓ సందర్భంలో పేర్కొన్నారు.
ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఎమ్మర్వో.




