Wednesday, 4 November 2026

బాజాపా అంత్యోదయ పథకాల కరపత్రాల పంపిణీ

పెనుబల్లి, జూన్ 22(జనం సాక్షి)మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపుమేరకు గురువారం పెనుబల్లి మండల అధ్యక్షులు బొర్రా నరసింహారావు నేతృత్వంలో పెనుబల్లి మండలంలోని 9 ఏళ్ల మోడీ ప్రజా రంజక, అంత్యోదయ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ వీరంరాజు పాల్గొని మాట్లాడుతూ భాజపా ప్రభుత్వ ఉద్దేశం ప్రభుత్వ పథకాల ప్రయోజనం చిట్టచివరి ప్రజలకు సైతం అందటమేనని, అందులో భాగంగా నేటి వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతమైనదని, కానీ అందుకు విరుద్ధంగా కేసీఆర్ కుటుంబం నేతృత్వంలోని బారాస ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణ సంపద మొత్తం వారి కుటుంబ, వారి అనుయాముల పరమైతున్నదని, చివరికి కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం తమ పథకాలుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నదని అన్నార రు.