Wednesday, 4 November 2026

పెద్ద కొడప్ గల్ లో కాంగ్రెస్ పార్టీ ధర్నా

జుక్కల్, జూన్ 22, (జనంసాక్షి),కామారెడ్డి జుక్కల్ నియోజక వర్గంలోని పెద్ద కొడ ప్ గల్ మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది దగా నిరసనలో భాగంగా ధర్నా చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి నిప్పంటించారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తహాసీల్ కార్యాలయానికి వెళ్లి ప్రజాసమస్యల పై గిర్దావార్ చందూరి అంజయ్య కు మెమోరాండం సమర్పించారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జుక్కల్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి , మాజి ఎమ్మె ల్ల్యే సౌదాగర్ గంగారాం మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుందన్నారు.దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ఎవరికైనా ఇచ్చాడా అని ప్రశ్నించారు. దళిత బంధు పది లక్షలు దళితులందరికీ ఇస్తానని కొద్ది మందికి మాత్రమే ఇచ్చారనిఅన్నారు.టి ఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని తానే గద్దెనెక్కికూర్చున్నా డని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సిఎం ఇంతవరకు ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు. గ్రూప్ వన్ ప్రశ్నపత్రాలు లీక్ చేసి నిరుద్యోగులను మనోవేదనకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన సిఎం నిరుద్యోగులకు మొండి చేయి చూపాడని ఎద్దేవా చేశారు.ఈకార్యక్రమంలోకామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు గజానంద్ పటేల్, పిసిసి డెలిగేట్ విఠల్ రెడ్డి,రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ఇంఛార్జ్ రాజి రెడ్డి,టిపిసిసి ఐటి సెల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ కాంబ్లే,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సౌదగర్ అరవింద్, ఏడు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.