ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ
రాంచీ, డిసెంబర్6 (జనంసాక్షి) : అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, వారి సేవలను ప్రజలు మరచిపోరని, జవాన్ల త్యాగాలకు వందనం చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. శనివారం ఝాార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మోడీ ఉద్వేగంతో ప్రసంగించారు. మన ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని, దేశంలో శాంతికి విఘాతం కలిగించే శక్తులను కూకటివేళ్లతో పెకిలిస్తామని ఆయన తేల్చిచెప్పారు. అవినీతి నుంచి ఝాార్ఖండ్‌కు విముక్తి లభించాలంటే బీజేపీకి ఓటువేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇక్కడ అవినీతి రాజకీయాలకు పాతర వేయాలన్నారు. రాష్ట్రం ఏర్పాటు వల్ల కొందరు ఇక్కడ తమ సొంత లాభాలు చూసుకుంటున్నారని అన్నారు.





