అమర జవాన్ ర్యాడా మహేశ్ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నివాళి
వేల్పూర్,నవంబరు 9(జనంసాక్షి)దేశ రక్షణలో అమరుడైన ర్యాడా మహేశ్ ప్రాణత్యాగం వృథా కాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం అమర జవాన్ స్వగ్రామం నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లిలో మహేశ్ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. దేశానికి మహేశ్ చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. కోమన్‌పల్లిలో అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు హైదరాబాద్‌లోని ఆర్మీ కార్యాలయ అధికారులతో మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తీకేయ అమర వీరునికి నివాళులర్పించారు.