Wednesday, 4 November 2026

అమర వీరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ

అమర వీరుల త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ : కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి . శనివారం శామీర్ పేటలో అఫ్జల్ ఖాన్ తెలంగాణ మలిదశ తొలి అమర వీరుడు శ్రీకాంతాచారి 13 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .
ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. ఉద్యమ ద్రోహుల ఆగడాల వలన తెలంగాణ వచ్చుట ఆలస్యం అవుతుండటంతో మనస్థాపానికి గురై శ్రీకాంతాచారి నిప్పంటించుకొని ఆత్మ బలిదానం చేసుకున్నారని తెలిపారు. దాదాపు పన్నెండు వందల ఉద్యమ కారులు ఆత్మ బలిదానం కారణంగా నే తెలంగాణ వచ్చిందని, వారందరి కుటుంబాలకు బాసటగా ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. అదే విధంగా నేడు తెలంగాణ లో ఉన్న ఉద్యమ నాయకుల కు కూడా అన్ని విదాల ఆదుకొని, పెద్ద పీట వేయ వలసిన అవసరం ఉందని అఫ్జల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతు అన్నారు. ఈ కార్యక్రమం లో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, వెంకటేష్ , రమేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
3ఎస్పీటీ -3: నివాళులు అర్పిస్తున్న నాయకులు