Wednesday, 4 November 2026

రైతు కుటుంబానికి రైతు బీమా రూ.5 లక్షల చెక్కు

రైతు కుటుంబానికి రైతు బీమా రూ.5 లక్షల చెక్కు పంపిణీ చేసిన టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బోడ బద్దునాయక్

జనం సాక్షి,చెన్నారావుపేట

బాధిత రైతు కుటుంబానికి రైతు బీమా రూ. 5లక్షల చెక్కును టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బోడ బద్దూనాయక్, మండల వ్యవసాయ అధికారి కర్పూరపు అనిల్ కుమార్ లు పంపిణీ చేశారు.చెరువుకొమ్ము తండ గ్రామానికి చెందిన రైతు బోడ లక్ష్మణ్ గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు.నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సహకారంతో బాధిత రైతు కుటుంబానికి రూ 5 లక్షల చెక్కు మంజూరు అయింది. ఆ చెక్కును బాధిత రైతు బోడ లక్ష్మణ్ భార్య సరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, బోడ శంకర్,సుమన్ తదితరులు పాల్గొన్నారు.