మన ఊరు- మన చరిత్రపై అవగాహన
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్ నగర్ టౌన్:(జనం సాక్షి)03 డిసెంబర్’తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలంగాణలోని 12679 గ్రామాల సమగ్ర చరిత్రను గ్రంథస్తం చేయడంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు విద్యార్థులకు,అధ్యాపకులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు మన ఊరు మన చరిత్ర జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.లక్ష్మినరసింహం తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామ చరిత్రల నిర్మాణంలో భాగస్వాములు కానున్నట్లు తెలిపారు.మన ఊరు- మన చరిత్రలో భాగంగా ప్రతీ విద్యార్థి తన గ్రామానికి సంబంధించిన దాదాపు 50 రకాల సమాచారం సేకరించి కళాశాలలో సమర్పించాలని సూచించారు.గ్రామ నేపథ్యం,ఆవిర్భావం, వనరులు,వృత్తులు,పంటలు,చారిత్రక స్థలాలు,దేవాలయాలు మొదలగు విషయాలను పరిశోధనాత్మకంగా సేకరించి సమర్పించాలని సూచించారు.అనంతరం కళాశాల కోఆర్డినేటర్ డి.జనార్థన్ మాట్లాడుతు ప్రతీ విద్యార్థి తప్పకుండా గ్రామ వివరాలను ఒక క్రమపద్ధతిలో నమోదు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు గ్రామం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజు,అధ్యాపకులు ,వెంకటేశం,డా.డి.టేమాజి,శారద,కృష్ణవేణి పాల్గొన్నారు.




