Thursday, 5 November 2026

అమావాస్య రోజు అన్నదానం పవిత్రమైనది జంపన ప్రతాప్

కంటోన్మెంట్ జనం సాక్షి మే19 న్యూ బోయినపల్లి లో ఒకటవ వార్డ్ లో వివిధ దేవాలయాల్లో అమావాస్య రోజు నాడు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై అమావాస్య రోజు అన్నదానంచేయడం ఎంతో పవిత్రమైంది,అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్ని దానాల అన్నదానం మిన్న అన్ని అన్నారు.
శుక్రవారం అమావాస్య పురష్కరించుకొని న్యూ బోయినపల్లి బాపూజీనగర్ ప్రధాన రోడ్డులో ఉన్న శ్రీ దేవి నల్ల పోచమ్మ ఆలయం.జయనగర్ లోని నల్ల పోచమ్మ ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో జంపన ప్రతాప్ పాల్గొని అన్న ప్రసాద వితరణ చేసారు.ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమాలు కమిటీ సభ్యులు నిర్వహించడం అభినంద నీయమని అన్నారు.బాపూజీనగర్ నల్ల పోచమ్మ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలోజంపన ప్రతాప్ తో పాటు మాల్యాద్రి,రఘుచరన్, కమిటీ సభ్యులు దుర్గయ్య,ప్రేమ్ ముదిరాజ్, అజిత్ కళ్యాణ్,శ్రీకాంత్, రామారావు,పుట్టి నర్సింహా,మహేందర్ పాల్గొన్నారు.ఇక జయనగర్ నల్లపోచమ్మ ఆలయం వద్ద జరిగిన ఆన్నదాన కార్యక్రమంలో రాముగౌడ్,గోపి,శశిధర్ గౌడ్,టీంకుగౌడ్