నెన్నెల, మే 19, (జనంసాక్షి )
వీఆర్ఏలను క్రమబద్దికరణ చేస్తున్నాట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో నెన్నెల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 వేల మంది వీఆర్ఏల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో నెన్నెల మండల వీఆర్ఏ యూనియన్ అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్, నాయకులు ఎల్లెల పోశం, సునార్కర్ స్వామి, కామెర సురేష్, మాలోత్ శారద, వీఆర్ఏ లు పాల్గొన్నారు.
సీఎం కెసిఆర్ కు వీఆర్ఏల పాలాభిషేకం




