అమీర్ అబ్దుల్లా జి… మద్దతు కరో …బుయ్యని.

ఒక్కటైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
తాండూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరుకు స్వస్తి.
చేయి చేయి కలుపుదాం… కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం.
తాండూరు అక్టోబర్ 28( జనం సాక్షి) తాండూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్థానికులు ఆమె అబ్దుల్లా పోటీలో ఉన్న విషయం పాఠకులకు తెలిసింది అయితే శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన రెండో లిస్టులో బుయ్యని మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తాండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గట్టిగా ప్రకటించారు దీంతో ఆమీర్ అబ్దుల్లా నివాసానికి ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యని మనోహర్ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ కలిసి పార్టీ కార్యక్రమాల గురించి చర్చించారు .తన గెలుపుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యువనేత అమేర్ అబ్దుల్లా జి మద్దతు కరో అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ చేయి చేయి కలిపారు. తప్పకుండా మా మద్దతు ఉంటుందని అమీర్ అబ్దుల్లా వెల్లడించారు ఎలాగైనా సరే తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పుకొచ్చారు. తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి వర్గ పోరు లేదని మనమంతా ఒకటే కాంగ్రెస్ పార్టీ జెండా కింద పని చేద్దామని పేర్కొన్నారు.చేయి చేయి కలుపుదాం తాండూరు గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేదాం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.