వాషింగ్టన్, ఫిబ్రవరి 8 : అమెరికాలో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలకు పశ్చిమతీర ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ఇళ్లు నీటమునిగాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. ఒలంపిక్ పర్వతానికి తూర్పున కురిసిన వానలకు డెకాబస్ నది పొంగిపొర్లింది. ఆ ప్రాంతంలో 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వార్షపాతం నమోదు అయింది. పశ్చిమ వాషింగ్టన్‌లోనూ అనేక నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, వరదలకు తోడు ప్రచండగాలులు బీభీత్సం సృష్టిస్తున్నాయి.




