ఏలూరు: న్యూస్ యాంకర్ బద్రి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేశారు. బద్రి భౌతికకాయానికి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత బద్రి మృతదేహాన్ని విజయవాడకు తరలించారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ప్రమాదంలో గాయపడిన బద్రి భార్య లక్ష్మీసుజాత, పెద్ద కొడుకు సాయిదీపక్ పరిస్థితి విషమంగా ఉంది. బద్రి బావమరిది గండ్రోతు తారక్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.





