హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. పది రోజులపాటు యూస్ లో పర్యటించే కేటీఆర్ వివిధ ప్రఖ్యాత సంస్థల అధిపతులతో భేటీ అవుతారు. ఉన్నతాధికార ప్రతినిధి బృందం కూడా కేటీఆర్‌తోపాటు అమెరికా వెళ్లింది.
గతేడాదికూడాఅమెరికాలోపర్యటించినకేటీఆర్
రాష్ట్రాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన చేపట్టారు. గతేడాది కూడా యూఎస్‌లో పర్యటించిన కేటీఆర్… హైదరాబాద్‌కు పెట్టుబడులు ఆకర్షించడంలో కొంతవరకు మెరుగైన ఫలితాలు సాధించారు. కేటీఆర్ ప్రస్తుత యూఎస్ పర్యటనలతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మెరుగైనపారిశ్రామిక, ఐటీవిధానాలు…..
అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పారిశ్రామిక, ఐటీ విధానాలను వివరిస్తారు. రాష్ట్రంలో పెట్టబుడులకు ఉన్న అనుకూల పరిస్థితులు, వనరులు గురించి తెలిజేస్తారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా అంశాన్ని విదేశీ పెట్టుబడిదారుల దృష్టికి తీసుకెళతారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలకు ఇస్తున్న రాయితీలు వివరిస్తారు. సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహకాలను తెలియజేస్తారు. పరిశ్రమల అనుమతులుకు ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెట్టిన అంశాన్ని పెట్టుబడిదారులకు వివరిస్తారు.




